పటాన్‌చెరు టౌన్: సర్ ప్రక్రియ పై పార్టీ నాయకులు, ఆశావహులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని.. స్కామ్‌ల ప్రభుత్వం పోయి మళ్లీ సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎస్‌ఐఆర్, బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముత్తంగి ఓఆర్‌ఆర్ జంక్షన్ నుంచి పటాన్‌చెరు పట్టణం మీదుగా జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వరకు ఎమ్మెల్యే జీఎంఆర్ సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి, గూడెం విక్రమ్‌రెడ్డిల నా యకత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, శ్రేణులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, జీపులతో హరీశ్‌రావుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ శ్రే ణులనుద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ..ఇటీవ ల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్‌చెరు ని యోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి యావత్తు తెలంగాణ మీ వైపు చూసేలా చేశారన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగి ఎన్నికల ఫలితాలు మారాయని ఆరోపించారు.
యాజమాన్యమే పరిహారం చెల్లించింది..
సిగాచి ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయలేదని, కంపెనీ యాజమాన్యమే పరిహారం చెల్లించిందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో పట్టణంలో రూ.200 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడం చేతకాని దద్దమ్మ రాష్ట్ర ప్రభుత్వం అని విమర్శించారు. పటాన్‌చెరులో ఐటీ పార్క్ కోసం కేటాయించిన భూమిని ప్రభుత్వం విక్రయించిందని ఆరోపించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాలను బీఆర్‌ఎస్ గెలుస్తుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ..త్వరలో జరగనున్న బీఆర్‌ఎస్ పార్టీ మెంబర్షిప్ అంశంలో రెండు లక్షల సభ్యత్వం నమోదు చేసి కేసీఆర్‌కు బహుమతిగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ మాజీ చైర్మన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్‌ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్, పాల్గొన్నారు.
మాజీమంత్రి హరీశ్‌రావు
ఇతర రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కారణంగా మారిన ఎన్నికల ఫలితాలు
సిగాచి మృతులకు నమ్మకద్రోహం చేసిన ఘనత రేవంత్‌దే


