ఎల్లలుదాటి వచ్చిన భక్తులతో ఆదివారం ఏడుపాయల జనారణ్యంగా మారింది. తెల్లవారుజామున అర్చకులు వన దుర్గమ్మను పట్టువస్త్రాలతో అలంకరించి అర్చన, అభిషేకం చేశారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో సత్రాలు సరిపోక భక్తులు ఇబ్బంది పడ్డారు. చెట్లకింద సేద దీరారు. ఆలయ సిబ్బంది, పోలీసులు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. – పాపన్నపేట(మెదక్)
ఆలయం ఎదుట భక్తుల సందడి


