రాయికోడ్(అందోల్): మండల కేంద్రం రాయికోడ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 5వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి కిందిస్థాయి తరగతులకు పాఠాలు బోధించారు. విద్యార్థులు బోధించే తరగతులను జెడ్‌పీహెచ్‌ఎస్, పీఎస్ ప్రధానోపాధ్యాయులు నగేష్, బి.శ్రీనివాస్ పర్యవేక్షించారు. స్వయం పాలన దినోత్సవ కార్యక్రమంతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని హెచ్‌ఎంలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభ, తులసి, శ్రావణి, సల్మా, యాదవులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.


