ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: అమీన్‌పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనతోపాటు సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని శంకర్ గ్రీన్ హోమ్స్‌లో ఆదివారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమై వారి ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆంజనేయస్వామి, అష్టలక్ష్మి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామన్నారు. దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
శత చండీ యాగంలో ఎమ్మెల్యే
బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఆదివారం శ్రీ మహాలక్ష్మి చండీకేశ్వరి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వారాహి సహిత శత చండీ యాగంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వ్యాక్సినేషన్‌తో వ్యాధుల నుంచి రక్షణ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌తో ఆడపిల్లలకు వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వాస్పత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగలక్ష్మి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కంకర శీనయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


