కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి

Mar 9 2026 9:26 AM | Updated on Mar 9 2026 9:26 AM

జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం పట్టణ పరిధిలోని రాళ్లకత్వ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కంకర క్రషర్‌ యూనిట్లపై ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా క్రషర్‌ యాజమాన్యాలు కొనసాగిస్తుండటంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామస్తులు సంబంధిత అధికారులను కలిసి హైకోర్టు ఇచ్చిన కాపీలను అందజేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని లేకపోతే పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాళ్లకత్వ గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement