అన్నదాతలకు.. యాప్‌సోపాలు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు.. యాప్‌సోపాలు

Feb 18 2026 8:35 AM | Updated on Feb 18 2026 8:35 AM

అన్నదాతలకు.. యాప్‌సోపాలు

అన్నదాతలకు.. యాప్‌సోపాలు

చదువుకున్న రైతులకే యూరియా!

యూరియా బుకింగ్‌ కోసం అవస్థలు

యాప్‌ ద్వారా బుక్‌ చేసిన రైతులకు మాత్రమే యూరియా బస్తాలు దొరుకుతున్నాయి. మిగతా వారు నిత్యం ఫర్టిలైజర్‌ షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. అంతే కాకుండా యూరియా ఎప్పుడు వస్తోందో..? ఎప్పుడు అయిపోతుందే తమకు తెలియటం లేదని, ఫోన్‌ యాప్‌ ద్వారా మాత్రమే తెలుస్తుండటంతో చదువురాని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైతులందరికి యూరియా సరఫరా చేయాల్సిన అవసరం ఉంది.

20 వేల మెట్రిక్‌ టన్నులిచ్చాం

ఈ యాసంగిలో 27 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటి వరకు 20 వేల మెట్రిక్‌ టన్నులు వచ్చింది. మరో 7 వేల మెట్రిక్‌ టన్నులు రావాల్సి ఉంది. చదువు రాని రైతులకు బుకింగ్‌ చేయడంలో క్షేత్రస్థాయి అధికారులు సహాయం అందిస్తున్నారు.

– దేవ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement