అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా

Feb 18 2026 8:35 AM | Updated on Feb 18 2026 8:35 AM

అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా

అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా

గ్రామాల్లో గ్రూప్‌–1 ట్రైనీ అధికారుల పర్యటన

గ్రామాల్లో గ్రూప్‌–1 ట్రైనీ అధికారుల పర్యటన

వెల్దుర్తి(తూప్రాన్‌)/నిజాంపేట(మెదక్‌)/కొల్చారం(నర్సాపూర్‌)/కౌడిపల్లి(నర్సాపూర్‌): జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం గ్రూప్‌ – 1 స్థాయి ట్రైనీ అధికారుల బృందం సందర్శించింది. అనంతరం అధికారుల బృందం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి పనుల గూర్చి ఆరా తీశారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి బోధనా పద్ధతులను తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను సందర్శించారు. కాగా స్థానిక మండల అఽధికారులు, పలు గ్రామాల సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు అధికారుల బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రైనీ అధికారులు మాట్లాడుతూ.. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రజల జీవన విధానంపై క్షేత్రస్థాయిలో పర్యటించి వారితో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement