వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం

Feb 18 2026 8:35 AM | Updated on Feb 18 2026 8:35 AM

వేర్వ

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం

పటాన్‌చెరు టౌన్‌: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ముత్తంగి డివిజన్‌ పరిధిలోని పోచారానికి చెందిన రాకేశ్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల భార్యాభర్తలు గొడవపడటంతో శ్రీవాణి తల్లిగారిల్లైన శంకర్‌పల్లికి వెళ్లింది. ఈ క్రమంలో ఈ నెల 15న రాకేశ్‌ తన భార్యను తీసుకువచ్చేందుకు వెళ్లగా తాను రానని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చి తన తల్లికి జరిగిన విషయం వివరించాడు. ఈ నేపథ్యంలో 16న ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన అతడు ఇంటికి రాలేదు. ఫోన్‌ చేసి చూడగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. కుమారుడు కోసం స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. అదృశ్యంపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

భార్యతో గొడవపడి భర్త..

పటాన్‌చెరు టౌన్‌: భార్యతో గొడవపడిన భర్త అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని సాయిరాం నగర్‌ కాలనీకి చెందిన నరేశ్‌ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 15న మద్యం తాగకూడదని భార్య లావణ్య భర్తకు చెప్పడంతో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అదే రోజు మధ్యాహ్నం ఇంట్లో వారికి చెప్పకుండా బయటకు వెళ్లి అతడు తిరిగి రాలేదు. ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. భర్త కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం 1
1/1

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement