తిరుగుబావుటా..!
టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రులుగా బరిలోకి.. పోటీలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన అధికారులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను వేధిస్తున్న క్రాస్ ఓటింగ్ భయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పిన రెబెల్స్..ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటు గా రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. అయితే ఆశించిన మేర తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. హామీలు ఇచ్చి బుజ్జగింపులు చేసినప్పటికీ విత్‌డ్రా చేసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రెబెల్స్ ఇబ్బందిగా మారింది. టికెట్ దక్కని వారు కొందరు ఆ పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో మేమూ చూస్తామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తుండటం గమనార్హం.
విత్‌డ్రా చేసుకున్నా.. సహకరించడం ప్రశ్నార్థకమే..
నామినేషన్లు వేసిన వారిలో కొందరు ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతల ఒత్తిడికి తలొగ్గి తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కానీ, వీరు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపునకు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. భయానికో, భక్తికో నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నప్పటికీ ఓటింగ్ విషయానికి వస్తే క్రాస్ ఓటింగ్ చేయించేందుకు అంతర్గతంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనను కాదని మరొకరికి టికెట్ దక్కడంతో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు లోలోపల ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే పరిస్థితులు పలువార్డుల్లో కనిపిస్తున్నాయి.
పోటీలో నిలుస్తున్న
రెబెల్ అభ్యర్థులు
చివరి రోజు నాటకీయ పరిణామాలు


