బీజేపీ నాయకుల నిలదీత
బీజేపీ అభ్యర్థులకు సంబంధించిన బీ ఫారాలను అందజేసేందుకు పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి పైడి ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా బీ ఫారం అందని నాయకులు ఎల్లారెడ్డిని నిలదీశారు. పార్టీ నిర్వహించిన సర్వే ప్రకారం టికెట్లు కేటాయించకుండా ఓడే వారికే టికెట్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపు అవకాశాలున్న వారిని కాదని ప్రజల్లో గుర్తింపు లేని వారికి టికెట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో అసంతృప్తులను ఎల్లారెడ్డి సముదాయించివెళ్లిపోయారు.


