తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ నయం
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని మహిళా ప్రాంగణం, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. యువకులు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యకు బడ్జెట్ నిధులేవి?
పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులు తీవ్ర నిరాశకు గురిచేశాయని, దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యను కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చేసిందని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను మంగళవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ..కేంద్ర బడ్జెట్ మొత్తం సుమారు రూ 53.5 లక్షల కోట్లు కాగా, విద్యారంగానికి కేటాయించిన మొత్తం కేవలం రూ 1.39 లక్షల కోట్లు మాత్రమే అని తెలిపారు. మొత్తం బడ్జెట్‌లో సుమారు 2.6% మాత్రమేన్నారు. ఇది ప్రపంచంలో అత్యధికంగా ఉన్న యువత, విద్యార్థులు గల దేశానికి పూర్తిగా సరిపోని, బాధ్యతారాహిత్యపు కేటాయింపులన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, జెస్సీకా, జిల్లా నాయకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్‌రావు
జిన్నారం (పటాన్‌చెరు): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఎంపీ రఘునందన్ రావు ప్రజలను అభ్యర్థించారు. జిన్నారం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ బీఆర్‌ఎస్ పార్టీలు అవినీతితో కూరుకుపోయాయన్నారు. బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం
నారాయణఖేడ్: కేంద్ర బడ్జెట్‌లో దివ్యాంగుల సంక్షేమాన్ని మోదీ సర్కారు పూర్తిగా విస్మరించిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్ విమర్శించారు. ఖేడ్ అంబేడ్కర్ భవన్ ఆవరణలో సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జనాభాలో 5% ఉన్న దివ్యాంగులకు 0.0286% మాత్రమే బడ్జెట్‌లో నిధులను కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. కార్యక్రమంలో జిల్లా, స్థానిక బాధ్యులు సంగమేశ్, ప్రకాశ్‌రావు, సాయిలు పాల్గొన్నారు.
తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ నయం
తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ నయం
తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ నయం


