అలరించిన కుస్తీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన కుస్తీ పోటీలు

Feb 4 2026 8:40 AM | Updated on Feb 4 2026 8:40 AM

అలరిం

అలరించిన కుస్తీ పోటీలు

పాల్గొన్న అంత ర్రాష్ట్ర మల్లయోధులు

భారీగా తరలి వచ్చిన ప్రజలు

విజేతలకు ఎంపీ సురేశ్‌ షెట్కార్‌

బహుమతుల ప్రదానం

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): న్యాల్‌కల్‌ గ్రామ శివారు లోని ఉర్సే షరీఫ్‌ పీర్‌గైబ్‌ సాహెబ్‌ జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉదయం ప్రారంభమైన కుస్తీ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను చెందిన సుమారు 55 మంది పహీల్వాన్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఫైనల్‌ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన కుషాల్‌, మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన సంతోష్‌ పాటిల్‌ తలపడగా..కుషాల్‌ గెలుపొందారు. తొలిసారి కుస్తీ పోటీల్లో మహిళలు పాల్గొన్నారు. ఫైనల్‌ పోటీల్లో లాతూర్‌కు చెందిన దివ్యశ్రీ గెలుపొందారు.

అలరించిన కుస్తీ పోటీలు1
1/1

అలరించిన కుస్తీ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement