నేతలకు నిరసనల సెగ | - | Sakshi
Sakshi News home page

నేతలకు నిరసనల సెగ

Feb 4 2026 8:40 AM | Updated on Feb 4 2026 8:40 AM

నేతలకు నిరసనల సెగ

నేతలకు నిరసనల సెగ

పక్కగా పంట లెక్క రైతులు సాగుచేసిన వివిధ రకాల పంటల వివరాలను ఏఈఓలు ఆన్‌లైన్‌లో నమోదు చేపట్టారు. వివరాలు IIIలో u

ఎమ్మెల్యే మాణిక్‌రావును నిలదీసిన అసంతృప్తులు ఓడిపోయే వారికి టికెట్లు ఇచ్చారంటూ కార్యకర్తల ఆగ్రహం

పక్కగా పంట లెక్క రైతులు సాగుచేసిన వివిధ రకాల పంటల వివరాలను ఏఈఓలు ఆన్‌లైన్‌లో నమోదు చేపట్టారు. వివరాలు IIIలో u

జహీరాబాద్‌: టికెట్లు లభించక అసంతృప్తితో ఉన్న ఆశావహుల నుంచి ప్రధాన పార్టీల నాయకులకు నిరసన సెగ తగిలింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో బీ ఫారాలు అందజేసేందుకు జహీరాబాద్‌లోని మున్సిపల్‌ కార్యాలయానికి పార్టీ నేతలు రావడంతో వారిని ఆయా పార్టీల నేతలు నిలదీశారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌ బీ ఫారాలతో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకోగానే 14వ వార్డు నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన వారు ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తే పార్టీ మారిన వారికి టికెట్లు ఇస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసనలు తెలిపారు. సీఐ శివలింగం, ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌ ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితి చక్కదిద్దారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు పార్టీ అభ్యర్థులకు సంబంధించిన బీ ఫారాలను అధికారులకు అందజేశారు. టికెట్లు రాని వారు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement