పాలిసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Feb 4 2026 8:40 AM | Updated on Feb 4 2026 8:40 AM

పాలిసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

పాలిసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

జోగిపేట(అందోల్‌): 2026–27 సంవత్సరానికిగాను పాలిసెట్‌ దరఖాస్తు నమోదు గడువు ఈనెల 2 నుంచి ఏప్రిల్‌ 20వ తేదీ వరకు కొనసాగుతుందని జోగిపేట బాలికల పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ మాలోతు వాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 21 వరకు, రూ. 300 రుసుముతో ఏప్రిల్‌ 22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని తెలిపారు. పాలిసెట్‌ పరీక్ష మే 13న ఉంటుందని తెలిపారు.

వార్డుల అభివృద్ధి

బాధ్యత నాదే

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

సంగారెడ్డి: సంగారెడ్డిలోని 38వార్డులలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి వార్డులను అభివృద్ధికి కృషి చేస్తానని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హామీనిచ్చారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయిస్తానన్నారు. వార్డుల్లో ఉన్న అభ్యర్థులను గెలుపుతోపాటు మిగతా వార్డుల్లో పరిచయం ఉన్న వాళ్లను కూడా గెలిపించేలా ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement