హాజరైన ఎంపీ
జాతర ఉత్సవాలకు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ హాజరై పీర్‌గైబ్ సాహెబ్ దర్గాను దర్శించుకున్నారు. దట్టీని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కుస్తీ పోటీలను వీక్షించారు. పోటీలో విజేతలైన వారికి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ మార్కె ట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సిద్దిలింగయ్యస్వామి, గ్రామసర్పంచ్ జ్యోతిలక్ష్మి, నాయకులు పడకంటి వెంకట్, ప్రవీణ్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులు యూనూస్‌ఖాన్, నర్సింహులు, జగనాథ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.


