పటాన్‌చెరు ఎంవీఐగా నరేష్ బాధ్యతలు
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీ ఐ)గా నరేష్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఎంవీఐగా విధు లు నిర్వహించిన విజయ్‌రావు.. పదవీ విరమ ణ పొందడంతో ఆయన స్థానంలో నరేష్‌ను నియమించారు. జహీరాబాద్ చెక్ పోస్టు నుంచి డిప్యుటేషన్‌పై పటాన్‌చెరుకు వచ్చిన ఆయన.. సోమవారం బాధ్యతలు చేపట్టారు.
కాంగ్రెస్ వైఫల్యాలను
ఎండగట్టండి
మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి
పటాన్‌చెరు: అన్ని మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని మెదక్ మాజీ ఎమ్మెల్యే, సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల బీఆర్‌ఎస్ సమన్వయకర్త పట్లోళ్ల శశిధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఇస్నాపూర్‌లో మున్సిపల్ ఎన్నికల సమీక్షలో గడీల శ్రీకాంత్‌గౌడ్‌తో కలసి ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిపినట్లు తెలిపారు. రెబల్స్ బెడద లేకుండా సమన్వయం చేసినట్లు చెప్పారు. ప్రచారానికి గడువు చాలా తక్కువగా ఉన్నందువల్లా బీఆర్‌ఎస్ అభ్యర్థులు సమయం వృథా కాకుండా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో విఫలమైన సందర్భాన్ని ప్రతి ఓటరుకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశంలో నాయకులు ఘనపూర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, మేరాజ్ ఖాన్, దుర్గయ్య, జోగు ధన్‌రాజ్, కాంత్ రెడ్డి పాల్గొన్నారు.


