ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం

Feb 1 2026 10:42 AM | Updated on Feb 1 2026 10:42 AM

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం

● యథావిధిగా ప్రజావాణి ● కలెక్టర్‌ ప్రావీణ్య

● యథావిధిగా ప్రజావాణి ● కలెక్టర్‌ ప్రావీణ్య

సంగారెడ్డి జోన్‌: ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ..ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లకు స్పష్టమైన లక్ష్యాలు కేటాయించి, క్షేత్రస్థాయిలో ప్రక్రియ వేగంగా సాగేలా పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని చెప్పారు. ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఫిబ్రవరి 2న యథావిధిగా జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, ఆర్డీఓ రాజేందర్‌, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement