వినికిడి పరికరాలకు ఎల్‌ఓసీ అందజేత
మునిపల్లి(అందోల్): వినికిడి సమస్య, మాటలు రాక ఇబ్బంది పడుతున్న ఓ బాలికకు వినికిడి పరికరాల కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రూ.7 లక్షలకు సంబంధించి ఎల్‌ఓసీని బాలిక తండ్రి ఎండీ.హుస్సేన్‌కు అందజేశారు. మండలంలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన 2వ వార్డు సభ్యుడు ఎండీ హుస్సేన్ కుమార్తె పుట్టుకతో వినికిడి సమస్యతో మాటలు రాక బాధపడుతోంది. ఈ విషయాన్ని మంత్రి దామోదర దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందించి చికిత్స కోసం రూ.7 లక్షలను మంత్రి మంజూరు చేయించారు. కార్యక్రమంలో మోహన్, సయ్యద్ అలీ, ఎండీ కలీం, విఠల్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.


