కౌన్సిలర్ టు ఎమ్మెల్సీ
రెండు సార్లు కౌన్సిలర్, ఎమ్మెల్సీగా పని చేసిన ఫారూక్ హుస్సేన్
● అప్పటి ఓటర్లను గుర్తుంచుకునిఇటీవల కానుకలు
సాక్షి, సిద్దిపేట: కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్సీగా సిద్దిపేట పట్టణానికి చెందిన ఫారూక్ హుస్సేన్ పని చేశారు. సిద్దిపేట పురపాలక సంఘంలో 10వ వార్డు నుంచి 1981–1986, 1986–1992 వరకు కౌన్సిలర్‌గా గెలుపొందారు. 1987లో టెలిఫోన్ అడ్వైజరీ బోర్డు సభ్యునిగా, 1991లో రైల్వేబోర్డు జోనల్ మెంబర్‌గా పని చేశారు. తర్వాత 2004 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా, 2011 నుంచి 2023 వరకు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పని చేశారు. 2012లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతూనే 2016లో టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. రెండోసారి 2017లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. 27 మే, 2023తో ఎమ్మెల్సీ పదవి ముగిసింది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.
అప్పటి ఓటర్లకు కానుకలు
రాజకీయంగా ఎదగడానికి తొలి అడుగు కౌన్సిలర్‌గా గెలుపొందడం. ఆ గెలుపునకు కృషి చేసిన ఓటర్లను ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. అప్పటి పదో వార్డులో ఉన్న 321 కుటుంబాలను గుర్తించి రూ.3వేల విలువ చేసే 25 కిలోల బియ్యం, రెండు కుర్చీలు, చీర, టవల్‌ను ఇటీవల కానుకగా మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా అందించారు. చిన్న గల్లీ లీడర్ నుంచి ఎమ్మెల్సీ స్థాయికి ఎదగడానికి అప్పటి గెలుపే కారణం అని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఖర్చులో అప్పటికీ, ఇప్పటికీ భారీ తేడా
1981లో కౌన్సిలర్‌గా పోటీ చేసినప్పుడు నా ఎన్నికల ఖర్చు రూ.4,700 అయింది. ఆ డబ్బులు సైతం తన స్నేహితులు, కుటుంబ సభ్యులు డొనేట్ చేయగా వాటిని ఖర్చు చేశాను. ప్రత్యర్థిగా పోటీ చేసిన ఉప్పలయ్య రూ.85వేలు ఖర్చు చేశారు. అయినా నా మీద నమ్మకంతో కౌన్సిలర్‌గా గెలిపించారు. అప్పటి ఎన్నికల ఖర్చుకు... ఇప్పటి ఎన్నికల ఖర్చుకు భూమికి ఆకాశం అంత తేడా ఉంది. డాక్టర్ డబ్బులు తీసుకొని మంచి చేస్తారు. అదే రాజకీయ నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చేస్తారు.
– ఫారూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ
కౌన్సిలర్ టు ఎమ్మెల్సీ
కౌన్సిలర్ టు ఎమ్మెల్సీ


