అట్టహాసంగా క్రీడా పోటీలు ప్రారంభం
తొలి మ్యాచ్‌లో నల్గొండపైమెదక్ విజయం
రెండో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌పై ఖమ్మం గెలుపు
సంగారెడ్డి క్రైమ్: కంది మండలంలోని బీపీఆర్ క్రికెట్ గ్రౌండ్‌లో శుక్రవారం ఉమ్మడి మెదక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో నల్గొండ, మెదక్ జట్లు తలపడగా.. మెదక్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన మెదక్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. చేతన్ నిఖిల్(82), హర్షిత్(37) పరుగులు చేశారు. నల్గొండ బౌలర్లలో అరుణ్ చంద్ర, వరుణ్ సాయి, అహ్మద్ అజాముద్దీన్ తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నల్గొండ జట్టు కేవలం 34.1 ఓవర్లలో 159 పరుగుకే ఆలౌటైంది. హర్షవర్దన్(54) పరుగులుఓ రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. మెదక్ బౌలర్లలో రిశ్వంత్ 6 వికెట్లు పడగొట్టగా.. హర్షిత 3 వికెట్లు తీశాడు.
ఐదు వికెట్ల తేడాతో విజయం
కొండాపురం మండలంలోని సి.కోనాపుర్ ఎంఏ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్, ఖమ్మం జట్లు తలపడ్డాయి. ఉమ్మడి మెదక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన మహబూబ్ నగర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 34.1 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఖమ్మం జట్టు కేవలం 22.3 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 126 పరుగులతో విజయం సాఽధించింది.


