మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
గజ్వేల్: మున్సిపల్ ఎన్నికల వేళ.. సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుంకరి బాల్‌కుమార్ ఇంటి గేటుకు శుక్రవారం ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ అంశం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఓటు ప్రాధాన్యతను చాటి చెప్పాలనే సంకల్పంతోనే ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు బాల్‌కుమార్ తెలిపారు.
మిరుదొడ్డిలో వాలీబాల్ టోర్నీ
చిన్నారిపై పిచ్చికుక్క దాడి
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం శంఖాపూర్ తండాలో చిన్నారిపై వీఽధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం తండాకు చెందిన దీపేందర్‌సింగ్ కుమారుడు అమన్ దీప్‌సింగ్ (3) ఇంటి ఎదుట ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. దీంతో బాలుడికి తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండాలో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయని తండా వాసులు వాపోయారు.
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు


