ఇద్దరు చైన్‌ స్నాచర్ల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు చైన్‌ స్నాచర్ల అరెస్టు

Jan 31 2026 9:32 AM | Updated on Jan 31 2026 9:32 AM

ఇద్దరు చైన్‌ స్నాచర్ల అరెస్టు

ఇద్దరు చైన్‌ స్నాచర్ల అరెస్టు

● బంగారు గొలుసు స్వాధీనం ● నిందితులు రిమాండ్‌కు తరలింపు

● బంగారు గొలుసు స్వాధీనం ● నిందితులు రిమాండ్‌కు తరలింపు

జహీరాబాద్‌ టౌన్‌: పట్టణంలోని ఆదర్శనగర్‌ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్‌ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సైదా నాయక్‌ చోరీ వివరాలను వెల్లడించారు. పటాన్‌చెరువుకు చెందిన ఎండీ నిజాం, ఆయాజ్‌లు ఈ నెల 22న పట్టణంలోని ఆదర్శనగర్‌ కాలనీలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. కాలనీలో నివాసం ఉంటున్న సౌజన్య కంప్యూటర్‌ తరగతులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సమయంలో వెనక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సీసీ కెమెరాలను తనిఖీలు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు, మోటారు బైక్‌, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ శివలింగం, ఎస్‌ఐ వినయ్‌కుమార్‌, సిబ్బందిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement