ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వర్‌రావు
జహీరాబాద్ టౌన్: ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వర్‌రావు అన్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ది మిషన్ పథకం కింద లబ్ధిపొందిన కోహీర్ మండలంలోని వెంకటపూర్ గ్రామ పరిధిలోని రైతుల పంట పొలాలను శుక్రవారం ఆయన సందర్శించారు. రైతులు పండిస్తున్న కూరగాయ పంటలు, మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన అభివృద్ధి పథకం కింద పండ్ల తోటలు, కూరగాయల సాగు చేసుకునేలా ప్రభుత్వాలు రాయితీలు అందిస్తుందన్నారు. పూల సాగు, కూరగాయలకు వందశాతం రాయితీలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఉద్యాన పంటలో మల్చింగ్ విధానం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి కూడా ఆయన రైతులకు వివరించారు. ఆయన వెంట ఉద్యానశాఖ మండల అధికారి సునీత రోజ్, విస్తీర్ణ అధికారి ఆశోక్ రైతులు ఉన్నారు.


