8 మంది జూదరుల అరెస్టు
రూ.46,852 నగదు, 8 సెల్‌ఫోన్ల స్వాధీనం
పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని మైసమ్మ గుడి వద్ద అక్రమంగా జూదం ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. జూదం ఆడుతున్నట్లు సమాచారం మేరకు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ మేరకు వారి నుంచి రూ.46,852 నగదుతో పాటు 8 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జూదం ఆడుతున్న కృష్ణ, బాజీరావు, కంచరి సత్యం, సాయాగౌడ్, సంగమేశ్వర్, లింగం, యాదగిరిలను అరెస్ట్ చేశారు. పేకాట, బెట్టింగ్‌లతో చాలా కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, యువత తప్పు మార్గాలను ఎంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ సంగమేశ్వర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులుపాల్గొన్నారు.


