లేబర్ కోడ్‌ల రద్దుకు పోరాటం
జహీరాబాద్ టౌన్: పెట్టుబడుదారులకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను రద్దుకు పోరాటం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. పిరామల్ పరిశ్రమ వద్ద కార్మికులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, దేశంలో సంఘాలు, చట్టాలు లేకుండా ఉన్న చట్టాలను మార్చాలని చూస్తోందన్నారు. తక్షణమే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి మహిపాల్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు


