ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

Jan 29 2026 8:37 AM | Updated on Jan 29 2026 8:37 AM

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

జిన్నారం: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గుమ్మడిదల ఎస్సై లక్ష్మీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా బహిరంగ సమావేశాలు, సభలు, ర్యాలీలు, గుంపులుగా ఏర్పడవద్దని హెచ్చరించారు. బెల్ట్‌ దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరపవద్దన్నారు.

నర్సాపూర్‌: అనుమానాస్పద స్థితిలో మూడో తరగతి విద్యార్థి మృతిచెందిన సంఘటన నర్సాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో జరిగింది. ప్రిన్సిపాల్‌ వెంకటేశం కథనం ప్రకారం.. పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న హర్షిత్‌నాయక్‌ (8) బుధవారం మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో కళ్లు తిరుగుతున్నాయని, కడుపులో నొప్పిగా ఉందని తోటి విద్యార్థులకు చెప్పగా, వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వారు విద్యార్థి తండ్రి కిషన్‌నాయక్‌కు సమాచారం ఇవ్వడంతో పాఠశాలకు వచ్చి బాలుడిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతిచెందాడు. మృతుడి తండ్రి మాట్లాడుతూ.. పాఠశాలలో ఏం జరిగిందో ఉపాధ్యాయులు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి మరణంపై అనుమానంగా ఉందన్నారు. ఈవిషయమై ఎస్‌ఐ రంజిత్‌రెడ్డిని వివరణ కోరగా.. తమకు సమాచారం రాగానే పాఠశాలకు వెళ్లి ఆరా తీశామన్నారు. సీసీ కెమెరాలు పని చేయడం లేదని పాఠశాల సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని వివరించారు.

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

వట్‌పల్లి(అందోల్‌): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని దుద్యాలలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ లవకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని గోపాల్‌(40) తన కొంత కాలంగా మద్యానికి అలవాటు పడి భార్యతో పాటు ఘర్షణకు దిగేవాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో పాటు కుటుంబీకులతో గొడవకు పాల్పడ్డాడు. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి గోపాల్‌ ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

––––––––––––––––

28 జెజిపి 82: గోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement