ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి

Jan 29 2026 8:37 AM | Updated on Jan 29 2026 8:37 AM

ట్రాక

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి

చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మేడిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గొల్లెన మల్లేశం(45) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి ట్రాక్టర్‌పై ఇంటి నుంచి మల్లారం వైపు వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ రోడ్డు పక్కన పొలంలో బోల్తా పడింది. బలమైన గాయాలు కావడంతో మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న రైతులు ట్రాక్టర్‌ బోల్తా పడిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. మృతుడికి భార్య మహేశ్వరి, కుమారులు ప్రకాశ్‌, అజయ్‌ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సైఫ్‌ అలీ తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి1
1/1

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement