ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు
సంగారెడ్డి జోన్: మున్సిపల్ ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం వద్దని అదనపు కలెక్టర్ పాండు స్పష్టం చేశారు. స్టాటిస్టిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ నిఘా బృందాలు, జోనల్ అధికారులకు బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ తరగతులు ఆయన పాల్గొని మాట్లాడారు. అభ్యర్థుల ప్రచార పరిశీలన, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు, ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, నిరంతర తనిఖీల నిర్వహణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ, జోనల్ అధికారుల విధులు, బాధ్యతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాస్టర్ ట్రైనర్ కృష్ణ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నిబంధనలను పాటించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. సమావేశంలో ట్రైనింగ్స్ నోడల్ అధికారి రామాచారి, ఎంసీసీ నోడల్ అధికారి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పాండు


