ఇక్రిశాట్‌లో గవర్నర్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్‌లో బుధవారం జరిగిన నేషనల్ ఐపీ యాత్ర–2026, వికసిత్ భారత్–2047 కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేధో సంపత్తి అవగాహనపై చర్చించారు. కార్యక్రమంలో శాస్త్రవేతలు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సల్లగా చూడమ్మా!
పటాన్‌చెరు: మేడారం వెళ్లలేని భక్తుల కోసం రెండు దశాబ్దాలుగా అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని బంధంకొమ్ములో సమ్మక్క సారలమ్మ జాతరకు బుధవారం భక్తులు తరలివచ్చారు. ఈ జాతరకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి దంపతులు హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనం పండుగలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సజావుగా నామినేషన్ల ప్రక్రియ
సంగారెడ్డి: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. నామినేషన్ల మొదటిరోజైన బుధవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల తీరును తెలుసుకుని తగుసలహాలు, సూచనలను ఎన్నికల అధికారులకు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నికల అధికారులు ఉన్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌ఎస్
జిల్లా చైర్మన్‌గా దుర్గాప్రసాద్
నారాయణఖేడ్: నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ సంగారెడ్డి జిల్లా చైర్మన్‌గా వడ్ల దుర్గా ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర చైర్మన్ రహీం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ...సంస్థ బాధ్యులు సమాజసేవకు, మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సంస్థ నాయకులు గౌస్‌చిస్తీ, మైనోద్దీన్ ఖురేషీ, నర్సింహులు పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలు
చెల్లించాలి: సీఐటీయూ
కొండాపూర్(సంగారెడ్డి): గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ మండల నాయకులు రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఎంపీడీవో సౌమ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...జీవో నెంబర్ 51 సవరించి మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, పాత కేటగిరీలన్నింటిని కొనసాగించాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం అందించే సరుకులు, సబ్బులు, బెల్లం, ఏడాదికి రెండు జతల బట్టలు, బూట్లు,నూనె వంటివి అందడం లేదన్నారు. అనారోగ్యానికి గురై చనిపోయిన కార్మికుడికి దహన సంస్కారాల కింద రూ.20 వేలు, పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి కార్మికులు మరణిస్తే రూ.20 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఫిబ్రవరి 12న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు విజేందర్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇక్రిశాట్‌లో గవర్నర్
ఇక్రిశాట్‌లో గవర్నర్
ఇక్రిశాట్‌లో గవర్నర్


