తొలి రోజు 99 నామినేషన్లు
సంగారెడ్డి జోన్: జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీల్లో నామినేషన్ల సందడి మొదలైంది. మున్సిపల్ కార్యాలయాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలతో ఫైనల్ నోటిఫికేషన్‌ను ఆయా మున్సిపల్ కమిషనర్లు బుధవారం విడుదల చేశారు. అనంతరం అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా తొలిరోజే జిల్లా వ్యాప్తంగా 99 నామినేషన్లను దాఖలయ్యాయి. 11 మున్సిపాలిటీల పరిధిలో 256 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుంది. మొదటి రోజు సాదాసీదాగా వచ్చి అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. సంగారెడ్డిలో అత్యధికంగా 25 నామినేషన్లు రాగా కోహీర్‌లో ఒక్కటి కూడా దాఖలు కాలేదు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 10, సదాశివపేట మున్సిపాలిటీలో 14 , అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో 18, జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 3 నామినేషన్లు, గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను 3, గుమ్మడిదల మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 6 జహీరాబాద్‌లో 04 నామినేషన్లు దాఖలయ్యాయి. 99 నామినేషన్లలో కాంగ్రెస్ 46, బీఆర్‌ఎస్ 28, బీజేపీ 18, బీఎస్పీ 1, స్వతంత్రంగా 6 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మొదలైన మున్సిపల్ ఎన్నికల సందడి
సంగారెడ్డిలో అత్యధికంగా
25 నామినేషన్లు దాఖలు
రేపటితో నామినేషన్లు ముగింపు
తొలి రోజు 99 నామినేషన్లు
తొలి రోజు 99 నామినేషన్లు
తొలి రోజు 99 నామినేషన్లు


