కొత్త మున్సిపాలిటీలకు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

కొత్త మున్సిపాలిటీలకు మహర్దశ

Jan 29 2026 8:36 AM | Updated on Jan 29 2026 8:36 AM

కొత్త మున్సిపాలిటీలకు మహర్దశ

కొత్త మున్సిపాలిటీలకు మహర్దశ

జిన్నారం(పటాన్‌చెరు): నూతన మున్సిపాలిటీల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొత్తగా ఏర్పాటైన జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలలో మౌలిక వసతుల కల్పించేందుకు ఒక్కొ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.45కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు అధికార యంత్రాంగం కార్యచరణ రూపొందించేందుకు సిద్ధమవుతోంది.

మురుగు కాల్వలు, ఎల్‌ఈడీ లైట్లు

జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ నిధులతో రోడ్లు, మురుగు కాల్వలు, పార్కుల అభివృద్ధి, కూడళ్ల ఆధునీకరణ, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, తాగునీటి సరఫరా, అంతర్గత పారిశుద్ధ్య నిర్వహణ వంటి అభివృద్ధి పనుల ను చేపట్టనున్నారు. కొత్త పాలకవర్గం కొలువు తీరాక అభివృద్ధి పనులు చేపట్టే అవకాశాలున్నాయి. మూడు మున్సిపాలిటీల్లో కార్యచరణకు అనుగుణంగా అధికారులు సమాయత్తమవుతున్నారు.

జిన్నారం, గడ్డపోతారం,

గుమ్మడిదల మున్సిపాలిటీలకు..

ఒక్కో బల్దియాకు రూ.15కోట్ల చొప్పున

రూ.45కోట్లు మంజూరు

మౌలిక వసతుల కల్పనకు

భారీగా నిధులిచ్చిన ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement