ఓటు హక్కు వజ్రాయుధం
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలోని కొండాపూర్ మండల పరిధిలో మల్కాపూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్ గ్రౌండ్‌లో బుధవారం ‘మై భారత్– మై ఓట్ 18+’పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా యువజన శాఖ అధికారి రంజిత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటు హక్కు విలువను గురించి ప్రజలకు తెలియజెప్పారు. ‘మై భారత్– మై ఓట్ 18+ ఆకృతిలో విద్యార్థులు వరుసలు కట్టడం అలరించింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజయ్యతో పాటు విద్యార్థులు, యువతీ, యువకులు పాల్గొన్నారు. – కొండాపూర్(సంగారెడ్డి):


