మార్పుతోనే ప్రమాదాల నివారణ
పెద్దశంకరంపేట(మెదక్): ప్రమాదాలను అరికట్టాలంటే ప్రజలలో మార్పు తప్పనిసరి అని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని పద్మయ్య ఫంక్షన్ హాల్‌లో స్వయంసహాయక సంఘాలు, విద్యార్థులకు 37వ జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతీ ఒక్కరూ క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలనే లక్ష్యంతో అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని, హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దన్నారు. మద్యం తాగి వాహనం నడుపొద్దని సూచించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్‌ఐలు ప్రవీణ్‌రెడ్డి, శంకర్, పోచయ్య, ఏపీయం శకుంతల, క్యూబ్ హైవే సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ మహేందర్


