హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

Jan 28 2026 10:00 AM | Updated on Jan 28 2026 10:00 AM

హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

మనోహరాబాద్‌(తూప్రాన్‌): హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు జరిమాన విధించినట్లు మంగళవారం మనోహరాబాద్‌ ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెలిపారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం... బీహార్‌కు చెందిన సర్వన్‌కుమార్‌ మండలంలోని ముప్పిరెడ్డిపల్లిలో వీవీఎం ఆగ్రో కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో 2024లో ఏప్రిల్‌ 20న తోటి కార్మికుడు ఓం ప్రకాశ్‌ రాయ్‌తో సర్వన్‌కుమార్‌కు గొడవ జరిగింది. దీంతో ఓం ప్రకాశ్‌ బండరాయితో సర్వన్‌ తల పగులగొట్టి హత్యచేసి పరారయ్యాడు. అప్పటి ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి కేసు నమోదు చేశాడు. ఇన్వెస్టిగేషన్‌ అధికారి కృష్ణ సమగ్ర దర్యాప్తు చేసి , కీలక సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, నిందితుడు ఓం ప్రకాశ్‌రాయ్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేలు జరిమాన విధించారు. కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వెంకటేశ్‌, లైసనింగ్‌ అధికారి విఠల్‌, కానిస్టేబుల్‌ రవీందర్‌గౌడ్‌, సీడీఓ మహిపాల్‌రెడ్డి కేసులో సహకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసినందుకు ఎస్పీ అభినందించారు.

పేకాట స్థావరంపై దాడి

కల్హేర్‌(నారాయణఖేడ్‌): పేకాట స్థావరంపై దాడి చేసి జూదరులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. కల్హేర్‌ ఎస్‌ఐ రవిగౌడ్‌ వివరాల ప్రకారం... మండలంలోని కృష్ణాపూర్‌ శివారులో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసుల దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏడుగురి జూదరులను అదుపులోకి తీసుకుని రూ. 20,040 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement