పారదర్శకంగా మున్సిపల్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా మున్సిపల్‌ ఎన్నికలు

Jan 28 2026 9:57 AM | Updated on Jan 28 2026 9:57 AM

పారదర

పారదర్శకంగా మున్సిపల్‌ ఎన్నికలు

పారదర్శకంగా మున్సిపల్‌ ఎన్నికలు ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ జిల్లా కార్యదర్శిగా ఖైసర్‌ టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి టైమ్‌కు రాకుంటే చర్యలే

అదనపు కలెక్టర్‌ పాండు

సంగారెడ్డి జోన్‌: మున్సిపల్‌ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ పాండు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో మున్సిపల్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌, టీఓటీ అధికారులకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ..అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి ఎన్నికలు విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో శిక్షణ తరగతుల నోడల్‌ అధికారి రామాచారి తదితరులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌: ఇండియన్‌ నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌హెచ్‌ఆర్‌పీసీ) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్‌ అబ్దుల్‌ ఖైసర్‌ను నియమించినట్లు సంస్థ రాష్ట్ర చైర్మన్‌ నవోదయ సిద్దు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బషీరాబాద్‌లో సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఖైసర్‌కు నియామక ఉత్తర్వును అందజేశారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడారు. జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు న్యాయం అందేలా ఖైసర్‌ కృషి చేయాలన్నారు.

ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

శ్రీనివాస్‌ రాథోడ్‌

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: విద్యా హక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌టీయూ నాయకులు సదాశివపేట మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశ జనాభాలో 0.1% ఉన్న ఉద్యోగులకు పెన్షన్‌ ఇవ్వకుండా వేధిస్తున్న పాలకులు వారికి మాత్రం రెండేసి పెన్షన్లు తీసుకోవడం మరీ విచిత్రమన్నారు. ఫిబ్రవరి 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి జిల్లా నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అదనపు ప్రధాన ఎన్‌కె షాప్‌ అలీ, సీనియర్‌ జిల్లా నాయకులు బి.నరసింహరాజు, సుజావుద్దీన్‌, జిల్లా ఆర్థిక కార్యదర్శి రమణ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు

హత్నూర (సంగారెడ్డి)/సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యల తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు హెచ్చరించారు. హత్నూర మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ..విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంతోపాటు విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

మేడారం జాతర పై మాక్‌ అసెంబ్లీ

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పర్యావరణ అవగాహన కల్పించేలా ఈ నెల 29,30 తేదీలలో మాక్‌ అసెంబ్లీని నిర్వహించాలని వెంకటేశ్వర్లు ఆదేశించారు. మాక్‌ అసెంబ్లీకి సంబంధించి నివేదికను తయారు చేసి 3 లేదా 4 ఫొటోలను జతచేసి పీడీఎఫ్‌ రూపంలో 9440069750 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా పంపాలని సూచించారు.

పారదర్శకంగా  మున్సిపల్‌ ఎన్నికలు
1
1/3

పారదర్శకంగా మున్సిపల్‌ ఎన్నికలు

పారదర్శకంగా  మున్సిపల్‌ ఎన్నికలు
2
2/3

పారదర్శకంగా మున్సిపల్‌ ఎన్నికలు

పారదర్శకంగా  మున్సిపల్‌ ఎన్నికలు
3
3/3

పారదర్శకంగా మున్సిపల్‌ ఎన్నికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement