నామినేషన్‌ కేంద్రాల్లో కెమెరాలు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ కేంద్రాల్లో కెమెరాలు

Jan 28 2026 9:57 AM | Updated on Jan 28 2026 9:57 AM

నామినేషన్‌ కేంద్రాల్లో కెమెరాలు

నామినేషన్‌ కేంద్రాల్లో కెమెరాలు

కలెక్టర్‌ ప్రావీణ్య

సంగారెడ్డి జోన్‌: మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్‌ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌, మున్సిపల్‌ కమిషనర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ...అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. నోటిఫికేషన్‌ వెలువడినందున వెంటనే ఎంసీసీని అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా సీజ్‌ర్లు, రోజువారీ నివేదికలు తదితర అంశాల్లో పోలీస్‌ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమీక్షలో అదనపు ఎస్పీ రఘునందన్‌రావు, అదనపు కలెక్టర్‌ పాండు, మున్సిపల్‌ కమిషనర్లు, నోడల్‌ అధికారులు, ఎన్నికల విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్‌ఎం రామకృష్ణను అభినందించిన కలెక్టర్‌

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్‌ కాలనీ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ రాష్ట్రస్థాయిలో సాధించిన విజయం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్‌ ప్రావీణ్య పేర్కొన్నారు. ఆయనను కలెక్టర్‌ ప్రావీణ్య మంగళవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని విద్యారంగంలో రామకృష్ణ సేవలు అభినందనీయమన్నారు. కాగా, రామకృష్ణ చేసిన విశిష్ట సేవలకుగాను ఇటీవలే రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న సంగతి కూడా తెలిసిందే.

54 కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు

అదనపు కలెక్టర్‌ మాధురి

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: వచ్చేనెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 54 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్‌ మాధురి పేర్కొన్నారు. ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో మంగళవారం పోలీస్‌, ఇంటర్‌, పోస్ట ల్‌, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ మాధురి పాల్గొని మాట్లాడారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఉదయం 9.00 నుంచి 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement