రిజిస్ట్రేషన్‌ రచ్చ..! | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ రచ్చ..!

Jan 28 2026 9:57 AM | Updated on Jan 28 2026 9:57 AM

రిజిస

రిజిస్ట్రేషన్‌ రచ్చ..!

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పఠాన్‌చెరు మండలం కర్దనూరులో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ శంకుస్థాపనలు చేయనున్న రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయ భవనం విషయం వివాదానికి దారితీసింది. ఇంటిగ్రేటెడ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పేరుతో సంగారెడ్డి సబ్‌రిజిష్ట్రార్‌, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలను కర్దనూరుకు తరలిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రకటించడం కలకలం రేపింది. పటాన్‌చెరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని (జాయింట్‌–1,2,3) తరలిస్తే తమకేమీ అభ్యంతరం లేదని జగ్గారెడ్డి తెలిపారు. మరోవైపు సంగారెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ సైతం ఈ కార్యాలయం తరలింపు విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంత్రులు పొంగులేటికి చింత ప్రభాకర్‌ లేఖ రాశారు.

ఆగమేఘాలపై ఆహ్వాన పత్రికలో మార్పులు

భూమి పూజ కార్యక్రమం కోసం అధికారులు విడుదల చేసిన ఆహ్వాన పత్రికలో ‘‘ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌’’అని పేర్కొనడంతో సంగారెడ్డి ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంతోపాటు, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని కూడా కర్దనూరుకే తరలిస్తారనే అర్థం వచ్చింది. దీంతో జగ్గారెడ్డితోపాటు, ఎమ్మెల్యే చింతప్రభాకర్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేయగా తమ తప్పును తెలుసుకున్న అధికారులు వెంటనే ఆగమేఘాలపై ఆహ్వాన పత్రికలో మార్పు లు చేశారు. ‘‘సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌’’ పేరుతో మరో ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లయింది.

వివాదానికి దారితీసిన రిజిస్ట్రార్‌ శాఖ భవనం భూమిపూజ ఆహ్వాన పత్రిక

ఆ రెండు కార్యాలయాలు ఇక్కడే

చిన్న సమాచార లోపం వల్లే ఇది జరిగింది. సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంతోపాటు, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సంగారెడ్డి నుంచి తరలించే ప్రతిపాదనేమీ లేదు. ఈ రెండు కార్యాలయాలు సంగారెడ్డిలోనే కొనసాగుతాయి. పటాన్‌చెరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం (జాయింట్‌–1, –2, –3)లు మాత్రమే అక్కడికి వెళతాయి.

–వల్లి సుబ్బలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్‌

రిజిస్ట్రేషన్‌ రచ్చ..!1
1/1

రిజిస్ట్రేషన్‌ రచ్చ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement