సర్కారు బడుల్లో తనిఖీలు
జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలంలోని గుడుపల్లి, విట్టునాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రత్యేక తనిఖీ బృందం సభ్యులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా నోడల్ అధికారి ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిమ్మల కిష్టయ్య, వహబొద్దీన్ పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, టాయిలెట్స్ నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల సామర్థ్యం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుతోపాటు పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.


