మాంసాహారం వద్దు.. శాకాహారమే ముద్దు
పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ర్యాలీ
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో మాంసాహారం వద్దు.. శాకాహారమే ముద్దు అనే నినాదంతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైశ్య భవన్ నుంచి మొదలైన ర్యాలీ పట్టణ వీధుల గుండా సాగింది. అనంతరం కొండ మల్లయ్య గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు శాకాహారం గొప్పదనం గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ ప్రతినిధులు జక్క రాఘవులు, హైదరాబాద్ ప్రతినిధి మాధవి దర్తిక, సిద్దిపేట పిరమిడ్ మెడిటేషన్ ట్రైనర్ డాక్టర్ పాండు రంగం తదితరులు పాల్గొన్నారు.


