ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పారిశ్రామికవేత్త
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల పట్టణ కేంద్రానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి మౌనిక ఉదయ్ కుమార్ సోమవారం ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితురాలిగా హాజరై తిలకించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఐక్యత సమగ్రతను ప్రతిబింబించే విధంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. త్రివిధ దళాల పరేడ్‌ను వీక్షించడం మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన అవకాశం పట్ల ఆమె ధన్యవాదాలు తెలిపింది.


