నాడు తండ్రి.. నేడు తల్లి మృతి | - | Sakshi
Sakshi News home page

నాడు తండ్రి.. నేడు తల్లి మృతి

Jan 27 2026 9:38 AM | Updated on Jan 27 2026 9:38 AM

నాడు

నాడు తండ్రి.. నేడు తల్లి మృతి

● అనాథలైన చిన్నారులు

● ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మూడేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా... సోమవారం గుండెపోటుతో తల్లి మృతి చెందింది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ సంఘటన మండలంలోని కేశవాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జెట్టి లావణ్య గుండెపోటుతో మృతి చెందారు. మూడేళ్ల క్రితం జెట్టి భాస్కర్‌ ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న క్రమంలో అది తలకిందులై మృతి చెందాడు. ఈ దంపతులకు జెట్టి సాహిత్య(08), శ్రీనిధి(10) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ చిన్నారులిద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ మమత, వార్డు సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.

నాడు తండ్రి.. నేడు తల్లి మృతి 1
1/1

నాడు తండ్రి.. నేడు తల్లి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement