పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

Jan 27 2026 9:38 AM | Updated on Jan 27 2026 9:38 AM

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

మద్దూరు(హుస్నాబాద్‌): పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. సోమవారం దూల్మిట్ట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాఠశాలకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎంపీ నిధుల నుంచి రూ.1.20లక్షలతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులు పది పరీక్షల్లో ప్రతిభ కనబర్చి పాఠశాలకు జిల్లా స్థాయిలో పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, సర్పంచ్‌లు శ్రీలీలారెడ్డి, కమలాకర్‌ యాదవ్‌, ప్రధానోపాధ్యాయులు కరుణాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ గ్రామాశాఖ అధ్యక్షుడు అనిల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement