డ్రైనేజీ పనులపై డీసీహెచ్‌ఎస్ అసంతృప్తి
జోగిపేట(అందోల్): మున్సిపాలిటీలోని ఏరియా ఆస్పత్రి మురికినీరు బయటకు వెళ్లేందుకు వీలుగా అవుట్‌ఫుట్‌ను ఏర్పాటు చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంపై డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎండీ షరీఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఆస్పత్రిలోని డ్రైనేజీ లీకేజీలను స్వయంగా పరిశీలించారు. నాలుగు చోట్ల లీకేజీలు ఉన్నాయని, దీనివల్ల దుర్వాసన వస్తుందని సూపరింటెండెంట్ అన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ వదిలేశాడని డీసీహెచ్‌ఎస్ దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్‌పై చర్యలకు కలెక్టర్‌కు లేఖ రాయాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. వారం రోజుల్లో ఆరు మంది నూతన వైద్యులు నియామకం అవుతారని తెలిపారు. ఇటీవల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 12 మంది వైద్యులకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేయగా అందరు కమిషనర్‌కు సమాధానం ఇచ్చారని డీసీహెచ్‌ఎస్ తెలిపారు.
కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు


