మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన

Jan 27 2026 9:38 AM | Updated on Jan 27 2026 9:38 AM

మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన

మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన

నారాయణఖేడ్‌: ఖేడ్‌ పట్టణంలోని రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల మహిళా ఉత్పత్తుల జాతర రెండో రోజు సోమవారం కూడా కొనసాగింది. వివిధ గ్రామాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తాము పొందిన రుణాలతో తయారు చేసిన ఉత్పత్తులను స్టాళ్లలో ఏర్పాటు చేశారు. పిండి వంటలు, దుస్తులు, నిత్యావసరాలను ప్రదర్శించారు. పట్టణంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల వారు ఉత్పత్తులను తిలకించి కొనుగోలు చేశారు. ఐకేపీ ఏపీఎంలు సాయిలు, వంశీకృష్ణ, అనంతయ్య, నర్సింహులు, శ్రీనివాస్‌, సరిత, డీఎంటీ నర్సప్ప, సీసీలు వెంకట్‌, సంతోష్‌ కుమార్‌, సురేశ్‌, సుందర్‌లాల్‌, తుకారాం, శివానంద్‌, సంగన్న, మెప్మా అధికారి అనిత పాల్గొని పర్యవేక్షించారు. మహిళా సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులను ఇతర రోజుల్లో విక్రయించుకునేందుకు ముందుకు వస్తే రైతు బజార్‌లో అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement