రూ.80 లక్షలు మోసం.. యువకుడి అరెస్ట్
● వ్యాపారంలో వాటాలు, ప్రభుత్వ ఉద్యోగాల పేరిట
● గ్రామస్తుల నుంచి డబ్బులు వసూలు
కొల్చారం(నర్సాపూర్): పాతికేళ్లు కూడా నిండని ఓ యువకుడు జనానికి మాయమాటలు చెప్పి భారీ ఎత్తున డబ్బులు కాజేశాడు. ఈ ఘటన బుధవారం కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. మండలంలోని సంగాయిపేట గ్రామానికి చెందిన మన్నె శేఖర్ ఇటీవల కుమారుడు చేసిన అప్పులు తీర్చే క్రమంలో మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి కుమారుడు మన్నె సాయి చరణ్ సొంత మండలానికి చెందిన వ్యక్తుల నుంచి వ్యాపారంలో వాటా, భూముల అమ్మకాల్లో మధ్యవర్తిత్వంప్రభుత్వ ఉద్యోగాల పేరిట దాదాపు రూ.80 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వకపోగా మూడు నెలలుగా కనిపించకుండా పోయాడు. ఇటీవల గ్రామానికి రావడంతో డబ్బులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. తన వద్ద లేవని చేతులెత్తేశాడు. బాధితులు కొల్చారం పోలీసులకు ఫిర్యాదు చేయగా సాయి చరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. జనాలు అత్యాశకు పోవడంతోనే ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


