కుక్కల దాడిలో గొర్రెలు మృతి
చిలప్‌చెడ్(నర్సాపూర్): వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చిలప్‌చెడ్ మండలం బద్య్రా తండాలో జరిగింది. గొర్రెల యజమా ని కడావత్ లక్ష్మణ్ కథనం మేరకు.. శనివారం జీవాలను మేపుకొచ్చి పాకలోకి పంపించాం. ఆదివారం ఉదయం పాక దగ్గరకి వెళ్లి చూడగా నాలుగు గొర్రెలు మృతి చెంది కనిపించాయి. గొర్రెలపై కుక్కలు దాడి చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. గొర్రెల మృతితో నష్టం జరిగిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పిడుగుపాటుతో పాడి గేదె
మద్దూరు(హుస్నాబాద్): పిడుగుపాటుతో పాడి గేదె మృతి చెందిన ఘటన మండలంలోని ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మానేపల్లి రామచంద్ర తన వ్యవసాయ బావి వద్ద శనివారం రాత్రి గేదెను కట్టేసి ఇంటికొచ్చాడు. ఉదయం వెళ్లి చూసేసరికి పిడుగుపాటుతో గేదె మృతి చెందింది. రూ.65 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.
కుక్కల దాడిలో గొర్రెలు మృతి


