
కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
నర్సాపూర్ : కుమారుడితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని కాపాడారు. ఎస్‌ఐ లింగం కథనం మేరకు.. నర్సాపూర్‌కు చెందిన మన్నె జయ మ్మ సోమవారం నాలుగేళ్ల కుమారుడితో కలిసి స్థానిక రాయరావు చెరువు వద్దకు వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చెరువులో దిగి నీటి లోపలికి వెళ్తుండగా వాచ్‌మెన్ రమేశ్ గమనించి విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసు హెడ్ కానిస్టేబుల్ పాండరి, కానిస్టేబుల్ భిక్షపతి, యాదయ్య, నాగరాజు వెంటనే చెరువు వద్దకు వెళ్లి తల్లి కుమారుడిని నీటిలోంచి బయటకు తెచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ కలహాలతోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని జయమ్మ నిశ్చయించుకుందని ఎస్‌ఐ తెలిపారు. అనంతరం జయమ్మ భర్త అనిల్‌కుమార్‌ను స్టేషన్‌కు పిలిపించి భార్యాభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిచారు. తల్లికుమారుడిని కాపాడిన సిబ్బందిని ఎస్‌ఐతోపాటు పలువురు అభినందించారు.
చెరువులోకి వెళ్తుండగా కాపాడిన పోలీసులు