
అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..
బీజేపీ నేతలను పరామర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్
హత్నూర (సంగారెడ్డి): అకారణంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినంతమాత్రాన అధైర్య పడొద్దని, తాను అండగా ఉంటానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్‌లో ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆరు మంది బీజేపీ నాయకులపై కేసు పెట్టి రిమాండ్‌కు తరలించారు. అయితే.. బాధిత కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. రాజకీయ కక్షతో కొంతమంది నాయకులు బీజేపీ నేతలపై అకారణంగా దాడి చేసి, పైగా పోలీసుల చేత అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని, అయినా భయపడాల్సిన అససరం లేదన్నారు. ఆఖరుకు న్యాయమే గెలుస్తుందని, జైలు నుంచి విడిపించేందుకు అవసరమైతే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీయాదవ్, ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాగ ప్రభుగౌడ్, నాయకులు సంఘసాన్ని సురేష్, రమేష్ గౌడ్, సతీష్, గ్రామ బిజెపి నాయకులు పాల్గొన్నారు.