అనారోగ్య సమస్యలే అధికం | - | Sakshi
Sakshi News home page

అనారోగ్య సమస్యలే అధికం

Jun 16 2024 10:48 AM | Updated on Jun 16 2024 10:48 AM

అనారో

అనారోగ్య సమస్యలే అధికం

మొబైల్‌ ఫోన్లు అతిగా వాడడం వల్ల పిల్లల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఫోన్‌ చూడడం వల్ల ఆలోచన శక్తి తగ్గి, మతి మరుపు వస్తుంది. ఫోన్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ రేస్‌ వల్ల చర్మ, కళ్ల సమస్యలు వస్తాయి. చురుకుదనం తగ్గిపోతుంది. మెడ నొప్పి, తలనొప్పి, నిద్రలేమి, అలసట సమస్యలు తీవ్రమవుతాయి. శారీరక శ్రమ తగ్గి చిన్న తనంలోనే అనేక రుగ్మతలకు చేరువవుతారు. ఫోన్లలో ఆటలు ఆడకుండా మైదానంలో ఆడాలి. తద్వార శారీరక ఎదుగుదలతో పాటు మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారు.

–హేమరాజ్‌సింగ్‌, ప్రముఖ సర్జన్‌,

దుబ్బాక ఆస్పత్రి సూపరింటెండెంట్‌

ఆటలతో దృఢత్వం

ఆటలతో శారీరకంగా, మానసికంగా పిల్లలు ధృఢత్వంగా తయారవుతారు. 2018లో పాఠశాలల్లో లీడ్‌ ఇండియా ప్రోగ్రాం కింద చిర్రగోనే, గోటీలు, చారుపత్తా, రింగులు, దుంకుడు, కోతి ఆటలు ఉండేవి. దీంతో పిల్లలు ఆటలతో దృఢంగా ఉండేవారు. ఇప్పుడు అవి బంద్‌ కావడంలో పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. పాఠశాలల్లో మళ్లీ ప్రవేశపెడితే పిల్లలకు చాల మేలు చేకూరుతుంది. ప్రస్తుతం పిల్లలు సెల్‌ఫోన్లలో గేమ్‌లు ఆడుతూ ఆరోగ్యంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు పిల్లల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో కచ్చితంగా వారంలో ఒకరోజైనా ఆటలను తప్పనిసరిగా నిర్వహించాలి.

– కాసారం రమేశ్‌గౌడ్‌,

పీడీ (ఫిజికల్‌ డైరెక్టర్‌)

అనారోగ్య సమస్యలే అధికం  
1
1/1

అనారోగ్య సమస్యలే అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement