ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2024 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2024

Jun 16 2024 10:46 AM | Updated on Jun 16 2024 10:46 AM

ఆదివా

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2024

సెల్‌ఫోన్లలోనే ఆటలు

చిన్నారులు ఎక్కువగా సెల్‌ఫోన్లలోనే గేమ్స్‌ ఆడుకోవడం చూస్తున్నాం. గూగుల్‌, యూట్యూబ్‌లను ఓపెన్‌ చేసి గంటల కొద్దీ ఆటలు ఆడుతుండటం గమనార్హం. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా టెక్నాలజీ పుణ్యామా అని సెల్‌ఫోన్లు రాజ్యమేలుతున్నాయి. ఏం కావాలన్నా ఫోన్లలోనే వెతుక్కుంటున్నారు. చివరకు వంటలు కూడా సెల్‌ చూసుకుంటా చేయడం పల్లెల్లో ఫ్యాషన్‌గా మారింది.

ల్లెలంటే ఆట.. పాటలకు పుట్టినిల్లు. పచ్చని పంటలకు ఆనవాళ్లు. ఒకప్పుడు బావుల కాడికి పోవడం, చెట్ల దగ్గరికెళ్లి పండ్లు తెంపుకొని తినడం, ఆట పాటల్లో మునిగి తేలేవారు. సెలవులు వచ్చాయంటే చాలు అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లి పిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌, గోటీలు తదితర ఆటలతో సందడి కనిపించేది. కానీ, పాశ్చాత్య పోకడల ప్రభావం కారణంగా ఆటల సందడి కనుమరుగైంది. సెల్‌ఫోన్ల భూతం అడుగుపెట్టడంతో పిల్లలు ఆన్‌లైన్‌ ‘గేమ్‌’వైపే మొగ్గు చూపుతున్నారు.

పల్లెల్లో ‘స్మార్ట్‌’ బీమారీ

ఆటలను కబళిస్తున్న సెల్‌ఫోన్‌

చిన్ననాటి నుంచే ప్రభావం

వ్యాయామానికి యువత దూరం

జీవన శైలిపై ఎఫెక్ట్‌

మానసిక సమస్యలతో సతమతం

– గన్నె తిరుపతిరెడ్డి, దుబ్బాక

ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఆన్‌లైన్‌ గేముల వల్ల యువత జీవన శైలి దారి తప్పుతోంది. మానసికంగా కూడా బలహీనులవుతున్నారు. ఆనాటి గ్రామీణ క్రీడలు ఆడిన యువత చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవారు. అంతేకాకుండా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేవారు. కానీ రానురాను ఆ క్రీడలు కనుమరుగయ్యాయి.

ఏవీ నాటి ఆటలు?

పల్లెలో ఎన్నో రకాల ఆటలు కనిపించేవి. పిల్లలు చిర్రగోనే, కోతికొమ్మచ్చి, కచ్చకాయల ఆట, పైలా పచ్చీసు, గోటీలు, దాగుడు మూతలు, తొక్కుడు బిళ్ల, అష్ట చెమ్మ, బొమ్మరిల్లు ఆట, కై లాసం, చింతగింజలాట, పుంజీతం(చారుపత్తా), లింగోర్ష, ఖోఖో, కబడ్డీతో పాటు చాలా రకాలు ఆటలు ఆడడటం కనిపించేవి. బాల్యంలో ఎక్కువగా బయటనే ఆటపాటలతో గడిపేవారు. పిల్లలు బావుల వద్దకు వెళ్లి ఈత నేర్చుకొని ఎంజాయ్‌ చేసేవారు. పల్లెటూర్లలో ఈతరాని చిన్నారులు చాలా తక్కువ. నేడు ఈత రాని వారి సంఖ్యనే ఎక్కు వైంది. కబడ్డీ, వాలీబాల్‌ పోటీలు లేవు. ఇళ్లల్లో ఆడే క్యారం, చెస్‌ ఆటలు కూడా కనిపించడంలేదు. ఆటలతో పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎంతో పరిణితిచెందేవారు. నేడు ఆట పాటలు కనుమరుగవుతుండటం బాధాకరం.

వ్యసనాలకు యువత బలి

సెల్‌ఫోన్లలో వివిధ రకాల యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని వివిధ రకాల గేమ్‌లు ఆడుతున్నారు. బెట్టింగుల వల్ల ప్రతిరోజు యువత ఆర్థికంగా నష్టపోతోంది. అంతేకాక అప్పుల పాలై అమూల్యమైన తమ ప్రాణాలను బలి చేసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. అనేక ఆటలు సెల్‌ఫోన్లలోనే ఆడుతూ అన్ని రకాలుగా నష్టపోతున్నారు.

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 20241
1/6

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2024

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 20242
2/6

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2024

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 20243
3/6

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2024

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 20244
4/6

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2024

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 20245
5/6

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2024

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 20246
6/6

ఆదివారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2024

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement